❤️
Skip to Content

 బిల్వాష్టకం

మూడు దళాలు గల (త్రిదళం), మూడు గుణాల స్వరూపమైన (త్రిగుణాకారం), మూడు కన్నులు కలిగిన (త్రినేత్రం), మూడు ఆయుధాలతో (త్రియాయుధమ్) ఉన్న శివునికి, ఒక్క బిల్వపత్రాన్ని అర్పించడం మూడు జన్మల పాపాలను హరించగలదు.

మూడు దళాలు కలిగిన, పగుళ్లులేని, మృదువుగా, పవిత్రంగా ఉన్న బిల్వపత్రాలతో నేను నీ పూజ చేస్తున్నాను. ఓ శివా! ఒక్క బిల్వపత్రాన్ని నీకు అర్పించుతున్నాను.

కోటి కన్యలను దానం చేయడం, తిలపర్వతం (ఎక్కువ మొత్తంలో తిల ధాన్యం) దానం చేయడం, మరియు బంగారు పర్వతాన్ని దానం చేయడంవంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

కాశీక్షేత్రంలో నివసించడం, కాలభైరవుని దర్శించడం, మరియు ప్రయాగలో మాధవ స్వరూపాన్ని చూడడం వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

ఓ మహేశ్వరా! నేను ఇందువార వ్రతాన్ని ఆచరిస్తూ, ఉపవాసంగా ఉంటాను. రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేసుకుంటాను.అటువంటి నా భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను.

రామలింగ ప్రతిష్ఠించడం, వివాహ కార్యక్రమం నిర్వహించడం, మరియు చెరువు (తటాకం) నిర్మించడం వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

పూర్తిగా (అఖండంగా) ఉన్న బిల్వపత్రాలతో శివుడిని పూజించడం,పది వేల (ఆయుతం) బిల్వపత్రాలతో శివారాధన చేయడం, శివుని నామసహస్రాన్ని పఠించడం వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

ఉమాదేవితో కూడిన పరమేశ్వరా! నంది వాహనముగా కలిగిన దేవా! భస్మాన్ని మొత్తం శరీరమంతా ధరించిన మహేశ్వరా! భక్తిపూర్వకంగా ఒక్క బిల్వపత్రాన్ని నీకు అర్పిస్తున్నాను.

సాలగ్రామాలను బ్రాహ్మణులకు దానం చేయడం,పది చెరువులు లేదా బావులు తవ్వించి ప్రజలకు అందించడం, వెయ్యి కోట్ల యజ్ఞాలు నిర్వహించడం వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

ఒక కోటి ఏనుగులను దానం చేయడం - ఇది రాజసూయ యజ్ఞంలో గొప్ప పుణ్యకార్యంగా చెప్పబడింది,నూరు అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించడం,కోటి కన్యాదానాలు చేయడం (ఇది అత్యంత పవిత్రమైన దానం) వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి

అంతటి పవిత్రత కలిగిన బిల్వపత్రాన్ని దర్శించడం, స్పృశించడం పుణ్యఫలాన్ని అందిస్తుంది,అత్యంత ఘోరమైన పాపాలనూ తొలగిస్తుంది. అటువంటి బిల్వపత్రాన్ని శివునికి అర్పిస్తున్నాను.

వెయ్యి వేదాలను పఠించడం బ్రహ్మజ్ఞానానికి సమానమని చెబుతారు. అనేక కోట్లు వ్రతాలను ఆచరించడం గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. అంతటి పుణ్యఫలాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.

వెయ్యి అన్నదానాలను చేయడం,వెయ్యి ఉపనయన సంస్కారాలను నిర్వహించడం, అనేక జన్మలుగా చేసిన పాపాలను నాశనం చేయడం వంటి ఫలితాలు ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి

ఈ పవిత్రమైన బిల్వాష్టక స్తోత్రాన్ని ఎవరైనా భక్తితో శివుని సన్నిధిలో పఠిస్తే, వారు శివలోకాన్ని చేరుతారు. అంతటి ఫలితం ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల కలుగుతాయి.