❤️
Skip to Content

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం

ఈ శ్లోకంలో పరమాత్మను వర్ణిస్తున్నారు. ఆ పరమాత్మనే బ్రహ్మదేవుడిని సృష్టించి, వేదాలను బోధించాడు. మోక్షాన్ని కోరే నేను ఆ పరమాత్మననే శరణు పొందుతున్నాను.

ఈ శ్లోకం లో శివుడి దక్షిణామూర్తి స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. పరబ్రహ్మ తత్త్వాన్ని మౌనంగా బోధించే యౌవన స్వరూపుడైన దక్షిణామూర్తిని, మహర్షులచే చుట్టుముట్టబడి, గురువులలో శ్రేష్ఠుడైన, జ్ఞానముద్రను ప్రదర్శించే, సత్యస్వరూపమైన, ఆనందమయుడైన ఆయనను నేను భజిస్తాను.

ఈ శ్లోకం లో దక్షిణామూర్తిని వర్ణిస్తున్నారు. ఆయన వటవృక్షము క్రింద (దాని మొదలు నందు ) ఆసీనుడై, మునులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, మూడుభువనాలకు గురువుగా వెలుగొందుతున్నారు. జన్మమరణ దుఃఖాలను తొలగించగల సామర్థ్యం కలిగిన ఆ దక్షిణామూర్తిని నేను నమస్కరిస్తున్నాను.

వటవృక్షం క్రింద ఒక విచిత్రమైన దృశ్యం – యౌవనస్థుడైన గురువు, వృద్ధులైన శిష్యులకు మౌనంతోనే బోధన చేస్తాడు. ఆ మౌన ఉపదేశం ద్వారా శిష్యుల సందేహాలు పూర్తిగా తొలగిపోతాయి.

పరబ్రహ్మ స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారం. ఆయన ప్రణవ (ఓంకారం) యొక్క అంతరార్థంగా ఉన్నాడు. ఆయననే పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడిగా భావిస్తారు.ఆ దక్షిణామూర్తి స్వామి నిర్మలమైనవాడు, ప్రశాంత స్వరూపుడైనవాడు. అటువంటి స్వామికి నా నమస్కారం.

సమస్త విద్యలకు నిలయమైనవాడు, సంసారరూప రోగానికి వైద్యం చేసే వాడు. సమస్త లోకాలకూ గురువుగా వెలుగొందుతాడు. అటువంటి దివ్యమైన దక్షిణామూర్తికి నా ప్రణామాలు.

  ఈ శ్లోకం లో దక్షిణామూర్తి స్వామిని చిద్ఘన (చైతన్యరూపుడు) మహేశ్వరుడుగా వర్ణిస్తున్నారు. ఆయన వటవృక్షం క్రింద నివసించే భగవానుడు. ఆయన సచ్చిత్ (సత్య), చిత్ (చైతన్య) మరియు ఆనందం (ఆనంద) అనే మూడు అవయవాల సమ్మిళిత స్వరూపుడిగా ఉన్నారు. అటువంటి దక్షిణామూర్తికి నా ప్రణామాలు.

ఈ శ్లోకం లో దక్షిణామూర్తి స్వామిని ఈశ్వరుడు, గురువు మరియు ఆత్మ అనే మూడు విభిన్న రూపాలలో వర్ణిస్తున్నారు. ఆయన ఆకాశం (వ్యోమ) లాంటి శరీరంతో, విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నారు. అటువంటి దక్షిణామూర్తికి నా నమస్కారాలు.

యోగులు తమ చేతి వేళ్లను యోగముద్రలో ఉంచి, అంటే అంగుళి (బొటనవేలు) మరియు తర్జని (సూచిక వేళి) కలిపి యోగ అభ్యాసం చేస్తున్నారు.శివుడు యోగ రూపంలో శ్రుతుల తాత్పర్యాన్ని ప్రదర్శిస్తాడు. అంటే, బ్రహ్మ మరియు జీవాత్మల ఏకత్వాన్ని సూచిస్తాడు. ​

ఈ ప్రపంచం అద్దంలో ప్రతిబింబించిన ఒక నగరంలా కనిపిస్తుంది. కానీ అది వాస్తవంగా మన అంతరంగంలోనే ఉంది. మనకు మాయ వల్ల ఈ ప్రపంచం వెలుపల ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది నిద్రలో కలలాగే భ్రమా స్వరూపం. నిజమైన జ్ఞానోదయం కలిగినప్పుడు, ఆత్మ యొక్క స్వరూపం ద్వంద్వరహితం అని గ్రహించగలరు. అటువంటి పరమ తత్త్వాన్ని బోధించే శ్రీ దక్షిణామూర్తి రూపమైన గురువుకు నా నమస్కారము.

ఈ జగత్తు ఒక గింజలో మగ్గంగా దాగి ఉన్నట్లు, ప్రారంభంలో నిర్దిష్ట రూపములేని పరబ్రహ్మంలో తానుగా ఉండేది. కానీ మాయ ప్రభావంతో దీనికి స్థల-కాలాది భేదాలు ఏర్పడి, అనేక రకాల వైవిధ్యాలతో భాసిల్లుతుంది. మాంత్రికుడు తన మాయా విద్యతో రకరకాల అద్భుతాలను సృష్టించినట్లే, పరబ్రహ్మ తన స్వేచ్ఛతో విస్తరింపజేసినదే. లేదా ఒక మహాయోగి తన తపస్సు ద్వారా సృష్టిని వికసింపజేసినట్లే, ఈ జగత్తు కూడా బ్రహ్మ యొక్క సంకల్పంతో ఉద్భవించింది. ఆ సత్యాన్ని బోధించే శ్రీ దక్షిణామూర్తి స్వరూపమైన గురువుకు నా నమస్కారం

ఎవరు సత్యస్వరూపమైన ఆత్మగా ప్రకాశిస్తున్నారో, అసత్యంగా అనిపించే వస్తువులను కల్పించే శక్తిగా వెలుగొందుతున్నారో, వేద వాక్యాల ద్వారా శరణాగతులైన శిష్యులకు "తత్వమసి" (నీవే పరబ్రహ్మవు) అనే మహావాక్యాన్ని ఉపదేశిస్తారో ఎవరైతే ప్రత్యక్ష జ్ఞానాన్ని అనుగ్రహించి, శిష్యులకు జనన మరణ చక్రంలో పునర్జన్మ లేకుండా చేయగలరో ఆ గురువైన దక్షిణామూర్తి నమస్కరిస్తున్నాను

  ఒక మట్టి పాత్రలో ఉన్న ఒకే ఒక దీపం, ఆ పాత్రలో గల రంద్రాల ద్వారా వెలుగులు బయటి ప్రపంచానికి వ్యాపించినట్లు, పరమాత్మా స్వరూపమైన జ్ఞానం (చైతన్యం) మన కళ్ల వంటి ఇంద్రియాల ద్వారా బయటకు వ్యాపించి అనుభవంలోకి వస్తుంది. ఈ సమస్త జగత్తు ఎవరి వలన అయితే ప్రకాశిస్తున్నదో , ఆ గురువైన దక్షిణామూర్తి నమస్కరిస్తున్నాను

 మాయావాదులు, అజ్ఞానులు తమను శరీరమే, ప్రాణమే, ఇంద్రియమాత్రమే లేదా శూన్యమే అని భావించి, వాటిని పరమార్థంగా అంగీకరిస్తారు. స్త్రీబాలాంధ (ఇక్కడ "స్త్రీ" పదం మాయ యొక్క అలంకరణాత్మక మార్పు, "బాల" అంటే అశ్రద్ధలో ఉన్న, "అంధ" అంటే మూఢత్వంతో నిండిన). అంటే, తేజస్సులేని, నిజాన్ని చూడలేని వాళ్లను సూచిస్తుంది. అటువంటి వారు ఈ భ్రమతో నిండిన భావనలతో జీవిస్తూ, "నేను ఈ శరీరమే" అని చెప్తారు. కానీ, ఇది మాయాశక్తి వల్ల కలిగిన భ్రాంతి మాత్రమే. ఈ మాయా మోహాన్ని తొలగించగల గురువైన శ్రీ దక్షిణామూర్తి కి నమస్కరిస్తున్నాను.

రాహు ప్రభావంలో ఉన్న సూర్యుడు లాగా, మాయా జాలంలో ఈ ఆత్మను మూసివేసినప్పుడు, నిజమైన ఆత్మ స్మృతిని కోల్పోతుంది.ఈ మాయా అంధకారాన్ని తొలగించి, నిజమైన సత్యాన్ని బోధించే శ్రీ దక్షిణామూర్తి గురువుకు నా నమస్కారం.

బాల్యం నుండి మృత్యువు వరకు మనకు అనేక స్థితులు మారుతూ ఉంటాయి, అలాగే జాగృత్, నిద్ర, స్వప్న మొదలైన అహంకార స్థితులూ మారతాయి. కానీ ఆంతర్యామిగా నిరంతరం ప్రకాశించే "నేను" అనే భావం మాత్రం మారదు. అదే స్వాత్మస్వరూపం. భక్తులకు ఈ పరమసత్యాన్ని ప్రకటించే శ్రీ దక్షిణామూర్తి గురువుకు నా నమస్కారం.

ఈ ప్రపంచాన్ని ఓ వ్యక్తి "కారణ-కార్య" సంబంధంగా లేదా "స్వామి-దాస" సంబంధంగా చూస్తాడు. అలాగే శిష్య-గురువు సంబంధంగా, తండ్రి-కుమారుడు మొదలైన సంబంధాలుగా భేదంగా భావిస్తాడు.నిద్రలో గానీ, జాగృత్ స్థితిలో గానీ ఈ జీవుడు మాయ చేత మోహితుడై ఇలా అనేక భేదాలను చూస్తుంటాడు. అటువంటి మాయను తొలగించి నిజ జ్ఞానాన్ని ప్రసాదించే శ్రీ దక్షిణామూర్తి స్వరూపమైన గురువునకు నా నమస్కారం.

ఎనిమిది రూపాలుగా (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తత్త్వం, దేవతలలో ఇంద్రుడు, చంద్రుడు మరియు పురుషునిగా) ఈ జగత్తు చరాచరమంతటా రూపాంతరమై ఉన్నాడు. దీనిని సరైన విచక్షణతో పరిశీలించిన వారికి పరబ్రహ్మ తప్ప మరేదీ కనిపించదు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తి మహాగురువుకు నా నమస్కారం!

ఈ స్తోత్రంలో "సర్వం ఆత్మ స్వరూపమే" అని స్పష్టంగా చెప్పబడింది.ఈ స్తోత్రాన్ని వినడం, అర్థం చేసుకోవడం, ధ్యానం చేయడం, పఠించడం వల్ల ఈశ్వరత్వాన్ని సాధించవచ్చు.ఈ జ్ఞానం ఎనిమిది విధాలుగా అభివృద్ధి చెందుతుంది (అష్టైశ్వర్యంగా మారుతుంది).ఇది అపరిమితమైన ఐశ్వర్యాన్ని, దైవ శక్తిని ప్రసాదిస్తుంది.